: ఎన్నికల బరిలో మూన్ మూన్ సేన్, బైచుంగ్ భుటియా


సినిమాలు, క్రీడల్లో కొంతకాలం రాణించి పాతబడిన వారంతా 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఇదే సరయిన మార్గమని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ (బంకురా), మాజీ ఫుట్ బాల్ ఆటగాడు బైచుంగ్ భుటియా (డార్జిలింగ్) తృణమూల్ కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ 48 మందితో కూడిన తొలి జాబితాను ఈ రోజు విడుదల చేశారు. అందులో వారిద్దరి పేర్లు కూడా ఉన్నాయి.

  • Loading...

More Telugu News