: అద్వానీజీ రాహుల్ కు వంతపాడుతున్నారా?
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తరచూ విమర్శలు చేయడం తెలిసిందే. ఇప్పుడు రాహుల్ బాటలోనే మోడీపై బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మోడీ వైఖరితో బీజేపీ పరిస్థితి 'వన్ మ్యాన్ పార్టీ'లా తయారైందని వ్యాఖ్యానించారు. ఈ ధోరణి అన్నివేళలా సరికాదని అద్వానీ హితవు పలికారు. బీజేపీలో ఆ ఒక్కడిదే హవా అన్న రాహుల్ విమర్శతో అద్వానీ ఏకీభవించినట్టయింది.