: ఐపీఎల్-7లో 60-70 శాతం మ్యాచ్ లు భారత్ లోనే: బిశ్వాల్


ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఐపీఎల్-7 సీజన్ పై క్రమేణా స్పష్టత వస్తోంది. తాజా సీజన్ లో 60-70 శాతం మ్యాచ్ లను భారత్ లోనే నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిశ్వాల్ వెల్లడించారు. నేడు ఢిల్లీలో సమావేశమైన బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్, సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి సంజయ్ పటేల్, ఐపీఎల్ సీఈవో సుందర్ రామన్, బిశ్వాల్ మ్యాచ్ ల నిర్వహణ అంశంపై తీవ్రంగా చర్చించారు. ఐపీఎల్ ఓ దేశవాళీ టోర్నీ అని, అందుకే అత్యధిక మ్యాచ్ లు భారత గడ్డపైనే జరపాలన్నది తమ నిర్ణయమని సమావేశం అనంతరం బిశ్వాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News