: పాక్ మిలిటరీకి మరోసారి అమెరికా నిధులు
అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామి పాకిస్తాన్ పై మరోసారి ప్రేమ కురిపించింది! పాక్ మిలిటరీ బలోపేతానికి రూ.1731 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు బదులుగా పౌర సేవల కోసం అందించే నిధుల్లో కోత పెట్టాలని అమెరికా సర్కారు తీర్మానించింది. ఓవైపు ఆర్ధిక కష్టాలు చుట్టుముడుతున్నా, ఉగ్రవాదంపై పోరు ప్రణాళికల్లో భాగంగానే ఈ నిధులు కేటాయించనున్నట్టు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై భారత వర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది.