: పుట్టగొడుగులతో క్యాన్సర్ పరార్!
లోకంలో మంచి చెడూ ఉన్నట్టే పుట్టగొడుగుల్లోనూ రెండు రకాలు ఉంటాయి. కొన్నింటిని తింటే ఆ రుచిని కొన్నాళ్ళ వరకు మరిచిపోలేం. మరికొన్నింటిని తింటే కొన్నాళ్ళ వరకు కోలుకోలేం, అంత విషపూరితం అవి. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా. తాజాగా ఓ అధ్యయనం క్యాన్సర్ కు పుట్టగొడుగులు దివ్యౌషధం అని పేర్కొంటోంది. ఈజిప్టులో ప్రాచీనకాలంలో పుట్టగొడుగులు తింటే ఆయుష్షు పెరుగుతుందని అధికంగా తినేవారట. సరిగ్గా, ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని అమెరికాకు చెందిన న్యూయార్క్ మెడికల్ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు.
ప్రపంచంలో వేల రకాలు పుట్టగొడుగు జాతులు ఉండగా, తినగలిగిన మూడు రకాలనే వీరు తమ పరిశోధనకు ఎంచుకున్నారు. ముఖ్యంగా షిటాకే అనే జాతిలో ఉండే లెంటినాన్ అనే పదార్థం క్యాన్సర్ రోగుల జీవితకాలం పొడిగిస్తుందట. ఈ పదార్థం క్యాన్సర్ కణాలపై దాడి చేసి వాటిని హతమార్చుతుంది. ఇక మిటాకే జాతి పుట్టగొడుగుల్లో ఉండే నాన్-టాక్సిక్ పదార్థాలు బ్లాడర్ క్యాన్సర్ కారక కణాలను 90 శాతం సమర్థంగా అణిచివేస్తాయని తేలింది. ఈ నాన్-టాక్సిక్ పదార్థాలు విటమిన్ సితో కలిసి మెరుగైన రోగనిరోధక వ్యవస్థను రూపొందిస్తాయని అసోసియేట్ ప్రొఫెసర్ సెన్సుకే కోనో వెల్లడించారు.