: కిరణ్, బొత్స కాంగ్రెస్ ని కుక్కలు చింపిన విస్తరి చేశారు: డీఎల్


మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కుక్కలు చింపిన విస్తరిని చేశారని ఈ పార్టీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి మండిపడ్డారు. కడపలో ఆయన మాట్లాడుతూ, ఉరుములు, మెరుపులు వచ్చినంత వేగంగా రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. దీంతో అందరి హృదయాలు గాయపడ్డాయని అన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వచ్చిన రోజే సీఎం, పీసీసీ చీఫ్ లు రాజీనామా చేసి ఉంటే విభజన జరిగి ఉండేది కాదని డీఎల్ అభిప్రాయపడ్డారు. తెలుగు మాట్లాడే వాళ్లకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? అని అడిగిన బొత్స ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ కొత్త కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News