: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఈసీ నిర్ణయం తీసుకోవాలి: వినోద్


సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించకూడదని టీఆర్ఎస్ నేత వినోద్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వాదానికే ప్రజలు పట్టం కడతారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ నిషేధించినందున మున్సిపల్ ఫలితాలపై కేంద్ర, రాష్ట్ర కమిషన్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News