: తొమ్మిది మంది సంతానం కావాలంటున్న షకీరా
పాప్ గాయని షకీరా సంతానంపై బోలెడు ఆశలు పెట్టుకుంది. తన భాగస్వామి గెరార్డ్ పిక్ తో కనీసం ఎనిమిది లేదా తొమ్మిది మందినైనా పిల్లలను కనాలని అనుకుంటున్నట్లు, ప్రస్తుతం రెండో బిడ్డను కనడంపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. షకీరాకు ఇప్పటికే 15 నెలల మగబిడ్డ మిలాన్ ఉన్నాడు. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్ లతో బిజీగా ఉండడం వల్ల సమయం చిక్కడం లేదని, లేకుంటే ఇప్పటికే మరో గర్భం దాల్చి ఉండేదాన్నని చెప్పింది.