: సుప్రీం జోక్యంతో విభజన ఆగుతుందని ఆశిస్తున్నాం: రాయపాటి
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా బహిష్కృత ఎంపీలందరమూ కలసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నామని ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఈ విషయంలో సుప్రీం జోక్యంతో విభజన ఆగుతుందని భావిస్తున్నామన్నారు. బిల్లుకు రాజముద్ర పడినందున కోర్టు సైతం తమ వాదనలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి జైరాం రమేష్ సహా కొందరు వ్యక్తులు సుప్రీం న్యాయమూర్తులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని గుంటూరులో మీడియాతో మాట్లాడిన రాయపాటి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రజల ద్రోహి అయిన జైరాంను ఊరేగించడం సరికాదని, జైరాం మాటలు సీమాంధ్ర ప్రజలను ఎగతాళి చేసే విధంగా ఉన్నాయన్నారు.