: షీలాదీక్షిత్ ను గవర్నర్ చేయడంపై మండిపడ్డ ఆప్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను గవర్నర్ గా ప్రమోట్ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అగ్గిమీద గుగ్గిలమయ్యింది. ఆప్ నేత మనీష్ సిసోడియా ఢిల్లీలో మాట్లాడుతూ, కుంభకోణాల విచారణ నుంచి రక్షించేందుకే షీలా దీక్షిత్ ను కేరళ గవర్నర్ గా నియమించారని ఆరోపించారు. కామన్ వెల్త్ క్రీడల్లో నిధుల దుర్వినియోగం, కళాశాలల నియామకాల్లో అక్రమాలు తదితర అంశాల్లో షీలా దీక్షిత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, విచారణ ప్రారంభమయ్యే దశలో ఆమెను గవర్నర్ గా నియమించడం కేవలం ఆమెను రక్షించేందుకేనని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రానున్నందున నిన్న హడావుడిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన మండిపడ్డారు.