: ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ నుంచి జ్వాల, అశ్విని ఔట్
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో బై దక్కించుకున్న ఈ జోడి, రెండో రౌండ్లో చైనా జంటతో తలపడింది. 54 నిమిషాలపాటు సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో చైనా జోడీపై జ్వాల, అశ్విని ద్వయం 21-14, 15-21, 17-21 తేడాతో ఓటమి పాలైంది.