: 55 మంది ఉద్యోగులతో బిలియనీర్ల జాబితాకెక్కారు


కేవలం 55 మంది ఉద్యోగులే ఉన్నటువంటి కంపెనీ వాట్స్ యాప్. దీనిని 1.17లక్షల కోట్ల రూపాయలకు ఫేస్ బుక్ కు అమ్మేసిన వ్యవస్థాపకులు జాన్ కౌమ్(38), బ్రియాన్ ఆక్టన్(42) బిలియనీర్లు(రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువగల ఆస్తులున్నవారు) అయ్యారు. ఫోర్బ్స్ పత్రిక తాజా సంపన్నుల జాబితాలో చోటు సంపాదించారు. జాన్ కౌమ్ 680కోట్ల డాలర్ల(రూ.42,160 కోట్లు) సంపదతో 202వ స్థానంలో ఉండగా... బ్రియాన్ ఆక్టన్ 300 కోట్ల డాలర్ల (రూ.18,600 కోట్లు) సంపదతో 551వ స్థానంలో నిలిచాడు. వాట్స్ యాప్ కు 45 కోట్ల యూజర్లు ఉన్నారు.

  • Loading...

More Telugu News