: విలీనం చేస్తామని గతంలో కేసీఆర్ చెప్పారు: దిగ్విజయ్
తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ గతంలో చెప్పారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే, విలీనాన్ని తిరస్కరించడం ఆ పార్టీ ఇష్టమని, దానిపై తామేమి మాట్లాడబోమని చెప్పారు. కాగా, ఇతర పార్టీలతో పొత్తుపై టీఆర్ఎస్ వేసిన కమిటీని స్వాగతిస్తున్నామన్నారు. అలాగే, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఓ కమిటీ వేస్తామని, ఆ కమిటీ టీఆర్ఎస్ తో పొత్తుపై కేకే నేతృత్వంలోని కమిటీతో చర్చిస్తుందని దిగ్విజయ్ తెలిపారు.