: టీడీపీకి 10-16... వైఎస్సార్సీపీకి 11-17 లోక్ సభ స్థానాలు!


తెలుగునాట తెలుగుదేశం, యువజన శ్రామిక రైతు (వైఎస్సార్ కాంగ్రెస్) పార్టీల మధ్య హోరా హోరీ పోరు నడవనున్నట్లు సీఎన్ఎన్, ఐబీఎన్-లోక్ నీతి, సీఎస్ డీఎస్ ఎలక్షన్ ట్రాకర్ సర్వే పేర్కొంది. తక్షణం లోక్ సభకు ఎన్నికలు నిర్వహిస్తే... ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ముందుంటుందని... ఈ పార్టీకి 11 నుంచి 17 స్థానాల వరకూ వస్తాయని వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ కు టీడీపీ బలమైన పోటీ ఇవ్వనున్నట్లు ఈ సర్వే పేర్కొంటోంది. టీడీపీకి 10 నుంచి 16 లోక్ సభ స్థానాలు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ కు 6 నుంచి 12, టీఆర్ఎస్ కు 6 నుంచి 12 వరకు వస్తాయని వెల్లడించింది.

అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటుందని పేర్కొంది. తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ ముందంజంలో ఉంటుందని... లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ప్రజలు తొలి ప్రాధాన్యం కాంగ్రెస్ కు ఇవ్వనున్నారని తెలిపింది. టీడీపీ తెలంగాణలో మూడవ స్థానంలో(టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత)... సీమాంధ్రలో ద్వితీయ స్థానంలో(వైఎస్సార్ కాంగ్రెస్ తర్వాత) ఉంటుందని పేర్కొంది.

సీమాంధ్రలో రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ కు 45 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి లోక్ సభ ఎన్నికల్లో 33 శాతం, శాసనసభ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇక కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో 16 శాతం, శాసనసభ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో 3 శాతం, శాసనసభ ఎన్నికల్లో 1 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.

తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 42 శాతం ఓట్లు దక్కుతాయట. కాంగ్రెస్ కు 20 శాతం ఓట్లే రానున్నాయని వెల్లడైంది. టీడీపీకి 11 శాతం, బీజేపీకి 6 శాతం, వైఎస్సార్ సీపీకి 2 శాతం ఓట్లు వస్తాయట. అదే లోక్ సభ ఎన్నికల వరకు చూస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ కంటే ముందుంది. కాంగ్రెస్ కు 32 శాతం, టీఆర్ఎస్ కు 26 శాతం, టీడీపీకి 11 శాతం, బీజేపీకి 10 శాతం, వైఎస్సార్ సీపీకి 1 శాతం ఓట్లు దక్కుతాయని సీఎన్ఎన్ ఐబీఎన్ ఎలక్షన్ ట్రాకర్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News