: పిజ్జా డెలివరీ బాయ్ కు ఆస్కార్ అతిథుల భారీ టిప్!


ఈ నెల 2న లాస్ ఏంజెలెస్ లో 86వ అకాడమీ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. పురస్కారాల ప్రధానోత్సవం సమయంలో అక్కడికొచ్చిన సెలబ్రిటీలందరికీ ఓ పిజ్జా బాయ్ నోరూరించే పిజ్జాలను తీసుకొచ్చి అందించాడు. బ్రాడ్ పిట్, ఏంజెలినీ జోలీ జంట, తదితరులు అత్యంత ఇష్టంగా ఆరగించారు. చాలా బాగున్నాయంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. అంతే ఆ పిజ్జా బాయ్ కు వెయ్యి డాలర్ల (రూ.61,856) టిప్ ను ఇచ్చారట. ఈ డబ్బునంతా కార్యక్రమానికి హాజరైన ప్రముఖ సెలబ్రిటీల దగ్గరనుంచి వసూలు చేసి ఇచ్చినట్లు కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన ఎల్లెన్ డిజెనెరెస్ తెలిపింది.

  • Loading...

More Telugu News