: రేపే ప్రధాని డర్బన్ కు ప్రయాణం
26 నుంచి దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల సమాహారం. ఈ దేశాల పేర్లలోని తొలి అక్షరంతో దీనిని BRICS అంటారు) దేశాల రెండు రోజుల సదస్సు ప్రారంభమవుతోంది. ఇందులో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ రేపు బయల్దేరి డర్బన్ వెళతారు. ప్రధాని నాలుగు రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి చిదంబరం, వాణిజ్యమంత్రి ఆనంద్ శర్మ, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ తదితరులతో కూడిన ఉన్నత స్ధాయి బృందం కూడా ప్రధాని వెంట వెళుతుంది.
డర్భన్ సదస్సు సందర్భంగా బుదవారం చైనా నూతన అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మన్మోహన్ సమావేశమవుతారు. బ్రిక్స్ దేశాలైన.. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా కోసం ప్రత్యేకంగా బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడం, వాణిజ్యం, శాంతి, పరస్పర సహకారం తదితర అంశాలు బ్రిక్స్ దేశాల అధినేతల మధ్య చర్చకు రానున్నాయి.