: మరో రెండు రోజులపాటు జడివానలే


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. రాష్ట్రాన్ని తడిపి ముద్ద చేస్తోంది. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు పడతాయని పేర్కొంది. పంటలకు నష్టం కలిగే అవకాశాలున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • Loading...

More Telugu News