: రాష్ట్ర విభజనపై కిరణ్ పిటిషన్ విచారణ నేడే
రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఆర్టికల్ 371(డి) ని సవరించకపోవడం, నదీ జలాల పంపిణీ, ఉమ్మడి రాజధానికి రాజ్యాంగ సవరణ చేయకపోవడంపై పిటిషన్ లో ప్రశ్నించారు. కిరణ్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని అన్ని పార్టీల నేతలు చెబుతున్నప్పటికీ విభజన రాజ్యాంగ బద్దంగా జరిగిందని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు. దీంతో, రాష్ట్ర విభజనపై నేటితో సీమాంధ్రుల అనుమానాలు పూర్తిగా తీరిపోనున్నాయి.