: కష్టపడుతున్నాం... నేర్చుకుంటున్నాం: అంబటి రాయుడు
భారత జట్టు ఆటగాళ్లమంతా విజయం కోసం ఎంతో కష్టపడుతున్నామని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్, తెలుగు తేజం అంబటి రాయుడు తెలిపాడు. బంగ్లాదేశ్ లో రాయుడు మాట్లాడుతూ, తాము ఎంతో నేర్చుకుంటున్నామని అన్నాడు. మ్యాచ్ లన్నీ హోరాహోరీగా సాగుతున్నాయని, విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపాడు. కెప్టెన్ కోహ్లీ, ధోనీ నుంచి చాలా నేర్చుకుంటున్నాడని, సానుకూల దృక్పథంతో ఆలోచిస్తున్నాడని రాయుడు తెలిపాడు. పాక్ తో మ్యాచ్ లో అతను కెప్టెన్ గా ఎంతో పరిణతి చూపించాడని, అయినప్పటికీ భారత జట్టు ఓటమిపాలవ్వడం నిరాశకు గురి చేసిందని రాయుడు చెప్పాడు.