: తెలంగాణలో జగన్ పర్యటన నేడే... వైఎస్ విగ్రహాలకు నిప్పంటించిన దుండగులు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు. జగన్ పర్యటనపై తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు హెచ్చరించి, ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఆయన పర్యటనకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జీళ్ల చెర్వు, కోక్యా తండా గ్రామాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు దుండగులు నిప్పంటించారు. విగ్రహాలపై టైర్లు పెట్టి నిప్పంటించడంతో విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. కాగా, జగన్ పర్యటనను నిరసిస్తున్న తెలంగాణ వాదులే ఈ చర్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.