: కేరళ గవర్నర్ గా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ నియామకం


ఢిల్లీ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ కేరళ గవర్నర్ గా నియమితులయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన షీలా దీక్షిత్ మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏపీ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆమెకు గవర్నర్ పదవి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ని నిన్న ఉదయం కలసిన సందర్భంగా ఈ విషయాన్ని ఆమెకు వెల్లడించారు. ప్రస్తుతం కేరళ గవర్నర్ గా పనిచేస్తున్న నిఖిల్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి బీహార్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్త గవర్నర్ గా షీలా దీక్షిత్ బాధ్యతలు చేపట్టడానికి వీలుగా నిన్న ఆమె నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News