: సోనియాను దెయ్యమని తిట్టినా... తెలంగాణ ఇచ్చింది: పొన్నాల
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని దెయ్యమని కేసీఆర్ తిట్టినా, సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని ఆయనే స్వయంగా చెప్పారని, టీఆర్ఎస్ ను విలీనం చేయమని కేసీఆర్ ను ఎవరూ అడగలేదని పొన్నాల తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రతికూలంగా మారే అవకాశమున్నా, సోనియాగాంధీ ధైర్యంతో తెలంగాణ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ మాట మార్చి, కుంటి సాకులు చెప్పడం తగదని, విలీన నిర్ణయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పొన్నాల వ్యాఖ్యానించారు.