: వచ్చే ఎన్నికలు రెండో స్వాతంత్ర్యాన్నిస్తాయి: జయలలిత
మరికొన్ని నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల సమరాన్ని మరో స్వతంత్ర పోరాటంగా అభివర్ణిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. 2014 ఎన్నికల అనంతరం దేశానికి రెండోసారి స్వతంత్రం వస్తుందని జయ వ్యాఖ్యానించారు. 'ఇవి ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు మాత్రమే కాదు, దేశానికి అవినీతి నేతల నుంచి, పొరుగు దేశాల బెదిరింపుల నుంచి స్వేచ్ఛను ప్రసాదించే ఎన్నికలు' అని వివరించారు. కాంచీపురంలో ఓ సభలో మాట్లాడుతూ ఆమె కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏపై నిప్పులు చెరిగారు.