: రేపు ఉదయం పదిన్నరకు ఎన్నికల సంఘం ప్రెస్ మీట్
సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈమేరకు రేపు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనున్నారు. ఉదయం పదిన్నరకు ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తారు. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. రేపు షెడ్యూల్ ప్రకటించిన అనంతరం దేశవ్యాప్తంగా కోడ్ అమల్లోకి రానుంది.