: నా సినిమాల్లో చాన్సుల పేరిట ప్రకటనలు నమ్మొద్దు: అక్షయ్


అభిమానులకు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పలు సూచనలు చేశారు. తన సినిమాల్లో చాన్సులిస్తామని ఎవరైనా ప్రకటనలు ఇస్తే నమ్మి మోసపోవద్దని హెచ్చరించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించాడు. 'నా ఫ్యాన్ క్లబ్ పేరిట కొందరు తప్పుడు ప్రకటనలిస్తున్నారు. నా సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా అవకాశాలని చెప్పి డబ్బులు గుంజుతున్నట్టు తెలిసింది. ఇవన్నీ మోసపూరిత చర్యలే. అభిమానులు తమ సొమ్మును వంచకుల చేతుల్లో పెట్టొద్దు' అని అక్షయ్ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News