: ఖాళీ అవడానికి టీడీపీ బ్రాందీ సీసా కాదు... కేసీఆర్ పై బాబు సెటైర్


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో హైదరాబాదు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఖాళీ అవడానికి టీడీపీ బ్రాందీ సీసా కాదని కేసీఆర్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బెల్టు షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కు తానే రాజకీయగురువునని చెప్పారు. కేసీఆర్ కుటుంబం కోసమో, జైపాల్ రెడ్డి కుటుంబం కోసమో తాను హైదరాబాదును అభివృద్ధి చేయలేదని స్పష్టం చేశారు. భాగ్యనగరానికి ఐటీ కంపెనీలను తెచ్చిన ఘనత తనదేనన్నారు. రాష్ట్రాన్ని ఈ స్థాయికి తెచ్చింది తానేనని బాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News