: ముప్పై వేల ఏళ్ళనాటి వైరస్ మళ్ళీ ప్రాణం పోసుకుంది!


సైబీరియా మంచు ఫలకాల కింద ఓ అరుదైన వైరస్ ను ఫ్రెంచ్ పరిశోధకులు కనుగొన్నారు. 30,000 వేల ఏళ్ళ క్రితం అది శిలాజరూపంలో ఘనీభవనం చెందగా, ఆ జెయింట్ వైరస్ కు తాజాగా ప్రయోగశాలలో ఊపిర్లూదారు. దీని పేరు పిథోవైరస్ సైబరికమ్. కంటికి కనిపించని వైరస్ జాతుల్లో ఇది అత్యంత భారీ వైరస్ అని తెలిపారు. ఇది 1.5 మైక్రోమీటర్ల పొడవుంటుందని తెలిపారు. ఊరట కలిగించే అంశం ఏమిటంటే, ఇది మానవాళికి ఎలాంటి హాని తలపెట్టదట. అమీబా వంటి ఇతర సూక్ష్మజీవరాశులపై ప్రతాపం చూపిస్తుందని ప్రయోగాల్లో తేలింది.

  • Loading...

More Telugu News