: టీఆర్ఎస్ విజయోత్సవాలు ఎందుకు చేసుకుంది?: విజయశాంతి


కాంగ్రెస్ పార్టీలో చేరాక తొలిసారి మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన విజయశాంతి, టీఆర్ఎస్ మాట తప్పడంపై నిప్పులు చెరిగారు. విలీనం చేయమంటున్న సమయంలో కుంటి సాకులు చెప్పి మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో తాము చెప్పిన ఏ విషయాలను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోలేదని, సరైన న్యాయం జరగలేదన్న కేసీఆర్ ఢిల్లీలోనే ఎందుకు నిలదీయలేదన్నారు. మీరు అనుకున్న తెలంగాణ రానప్పుడు విజయోత్సవాలు ఎందుకు చేసుకున్నారని... ఒంటెలు, గుర్రాలతో హంగామా దేనికి చేశారని సూటిగా అడిగారు. తెలంగాణ ప్రజలు సోనియాకు అండగా ఉంటారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి కాంగ్రెస్ రుణం తీర్చుకుంటారని, మాట తప్పరని అన్నారు.

  • Loading...

More Telugu News