: నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే విలీనం చేస్తారా?: విజయశాంతి


విలీనం లేదు, పొత్తు లేదంటూ కాంగ్రెస్ కు షాకిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. తనను కాంగ్రెస్ లో చేర్చుకున్నందునే విలీనం చేయనంటున్న కేసీఆర్, తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే విలీనం చేస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. విలీనం చేయాలని సోనియా ఎప్పుడూ తమను అడగలేదని కేసీఆర్ చెప్పారని... అలాంటప్పుడు విలీనం చేయనని తనకు తానుగా కేసీఆర్ ఎలా అంటారని నిలదీశారు. కాగా, గతంలో విలీనం చేస్తామని టీఆర్ఎసే చెప్పిందన్నారు. ఈ విధంగా కన్నతల్లికే టీఆర్ఎస్ వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. 25 ఎంపీ సీట్లను వదులుకుని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చారని విజయశాంతి పేర్కొన్నారు.

ఆడదాన్నని కూడా చూడకుండా తనను అర్ధరాత్రి పార్టీ నుంచి సస్పెండ్ చేశారని... కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ సస్పెండ్ చేసినా తాను ఎక్కడకూ వెళ్లలేదని, పార్లమెంటులో బిల్లు పాసయ్యాకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. ఇక దళితుడు అంటే టీఆర్ఎస్ కు ఎందుకంత చులకన? అని ప్రశ్నించిన రాములమ్మ... దళితుడిని సీఎం చేస్తానని ఒకనాడు చెప్పింది కేసీఆరే కదా? అని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News