: అమెరికన్లకు నీటి ఆదా తెలియదట!


ఇతర దేశాలకు దానిపై అవగాహన లేదు, దీని గురించి తెలీదు... అంటూ అపవాదులు వేసే పెద్దన్న అమెరికాకు నీటిని ఆదా చేయడం తెలియదని ఓ సర్వే తెలిపింది. ఇండియానా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నీటి వాడకంపై జాతీయ స్థాయి సర్వే చేశారు. ఇందులో నీటి ఆదాకు ఏం చేస్తారని ప్రశ్నలు సంధించారు. దీనికి 43 శాతం మంది అమెరికన్లు తక్కువ సేపు స్నానం చేస్తామని చెప్పారని పరిశోధకులు తెలిపారు. రోజుకు ఒకసారి స్నానం చేస్తామని... కానీ, టాయిలెట్లకు మాత్రం ఎక్కువ సార్లు వెళ్తామని, అప్పుడు ఫ్లష్ లలో వాడే నీటి వాడకం ఎక్కువ అన్న విషయం చాలా మందికి తెలియదని, దానిపై ఎవరూ శ్రద్ధ పెట్టడం లేదని అన్నారు. టాయిలెట్లలో ఫ్లష్ లు మార్చుకోవడం ద్వారా నీటి దుబారాను అరికట్టవచ్చని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News