: మోడీకి చరిత్రే కాదు జాగ్రఫీ కూడా తెలియదు: దిగ్విజయ్


కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ నేడు నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థికి చరిత్రే కాదు, జాగ్రఫీ కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో కామెంట్ చేశారు. 'మనకి తెలుసు మోడీ నాలెడ్జి ఏపాటిదో. కానీ, ఆయనకు చరిత్రే తెలియదనుకుంటే, జాగ్రఫీపై ఏమాత్రం అవగాహన లేదు. గుజరాత్ కంటే ఉత్తరప్రదేశ్ 10 రెట్లు పెద్దది. గుజరాత్ జనాభా 6 కోట్లైతే, యూపీ జనాభా 20 కోట్లు' అని ట్వీట్ చేశారు. మోడీ గుజరాత్ తో ఉత్తరప్రదేశ్ ను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలకు బదులుగా డిగ్గీ తాజా ట్వీట్లు వదిలారు. యూపీకి ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఏం చేశారని మోడీ నిన్న లక్నోలో జరిగిన సభలో ప్రశ్నించారు. యూపీలో 40 శాతం మందికి విద్యుత్ సౌకర్యం లేదని, గుజరాత్ లో 99 శాతం మందికి విద్యుచ్ఛక్తి అందుబాటులో ఉందని చెప్పారు. గతేడాది యూపీలో మహిళలపై 20 వేల దారుణాలు చోటు చేసుకుంటే, గత పదేళ్ళుగా గుజరాత్ ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News