: బందరు రైల్వే స్టేషన్ లో సూట్ కేసుల కలకలం
కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) రైల్వే స్టేషన్లో రెండు సూట్ కేసులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన సూట్ కేసులు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకుని సూట్ కేసులను తనిఖీ చేశారు. అందులో ప్రమాదకర వస్తువులు, పేలుడు పదార్థాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.