: కేంద్రం తీరుపై మార్చి 6 న బంద్ కు పిలుపునిచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మార్చి 6న ఆ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. గత వారంలో కురిసిన భారీ వడగళ్ళ వానల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్రం వెంటనే రూ. 5000 కోట్ల పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మార్చి 5 లోపు పరిహారం ప్రకటించకపోతే 6న రాష్ట్రం స్థంభించిపోతుందని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశానని, రైతులను ఆదుకోవాలని కోరానని చౌహాన్ తెలిపారు. ప్రధానిని కలిసేందుకు అనుమతి లభించలేదని అన్నారు. బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.