: రాష్ట్రంలో రెండు రోజుల వరకు వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజుల వరకు పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దానికి తోడు అక్కడక్కడ క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.