: రష్యాకు మరోసారి వార్నింగ్ ఇచ్చిన ఒబామా
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి సన్నద్ధమవడం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యా తన దుందుడుకు వైఖరితో చరిత్రకు అవతలి పార్శ్వంలో నిలుచుందని విమర్శించారు. తమ హెచ్చరికలు పెడచెవిన పెడితే ఆర్థిక, దౌత్య మార్గాల్లో రష్యా మెడలు వంచే ప్రయత్నం చేస్తామని ఒబామా హెచ్చరించారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు ముగిసిన పిమ్మట ఒబామా వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నీ రష్యా చర్యను ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రష్యా సేనలు ఉక్రెయిన్ లోని క్రిమియా ప్రాంతంలో ప్రవేశించిన సంగతి తెలిసిందే.