: పోప్ నోట బూతు మాట!
క్రైస్తవుల ఆరాధ్యుడు పోప్ ఫ్రాన్సిస్ నోట బూతు ధ్వనించింది. అయితే, అది పొరబాటునే సుమా! ఇంతకీ విషయం ఏమిటంటే... నిన్న వాటికన్ లో పవిత్ర ఆదివారం సందర్భంగా పోప్ భక్తులనుద్దేశించి ఓ ప్రమాణ పత్రాన్ని చదివారు. అది ఇటలీ భాషలో ఉంది. దాన్ని చదివే క్రమంలో ఓ చోట 'కసో' అనే పదానికి బదులుగా 'కజ్జో' అని పలికారు. ఇటాలియన్ భాషలో కజ్జో అంటే 'మైధునం' అనే అర్థంలో బూతుగా వాడతారు.
ఆయన ఇటాలియన్ లో పలికిన దానికి తర్జుమా ఎలా చేశారంటే... ఇఫ్ ఈచ్ వన్ ఆఫ్ అజ్ డజ్ నాట్ ఎమాస్ రిచెస్ ఓన్లీ ఫర్ వన్ సెల్ఫ్, బట్ హాఫ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్, ఇన్ దిస్ 'ఫక్' (ఇక్కడ 'ఇన్ దిస్ కేస్' అని పలకాలి) ద గాడ్ విల్ బికమ్ విజబుల్ త్రూ దిస్ గెస్చర్ ఆఫ్ సాలిడారిటీ (మనలో ప్రతి ఒక్కరం పరుల కోసమే పాటుపడాలి. అలాంటి సంఘీభావ చర్యల ద్వారానే దేవుడు మనకు సాక్షాత్కరిస్తాడు). పోప్ మహాశయుడు 'కసో' బదులు 'కజ్జో' అనడంతో అనువాదకుడు కాస్తా దాన్ని మక్కీకి మక్కీ దింపేశాడు, పోప్ ను నవ్వులపాల్జేశాడు. ఫ్రాన్సిస్ గారు తొలుత తప్పుగా పలికినా, వెంటనే సవరించుకున్నారు. ఆ రెండింటిని కలిపి ట్రాన్స్ లేట్ చేయడంతో విషయం చర్చనీయాంశం అయింది.