: సింగపూర్ లో చాలా ఖరీదు... ముంబై, ఢిల్లీలో చౌక


మన ముంబై, మన ఢిల్లీ ప్రపంచంలో ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్నాయి. అతి తక్కువ జీవన వ్యయమయ్యే నగరాలుగా ఇవి నిలిచాయి. నివాసానికి అత్యంత ఖరీదు, చవక నగరాల వివరాలతో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నివేదిక వెల్లడించింది. ముంబైలో ఎక్కువ మంది తక్కువ వేతన జీవులు ఉండడం.. వారు తక్కువ వ్యయంతో జీవించడం వల్ల ఇక్కడ ధరలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. సింగపూర్ ప్రపంచంలోనే నివాసానికి అత్యంత ఖరీదైన నగరంగా పేర్కొంది. ఇక్కడ కరెన్సీ బలంగా ఉండడం.. వ్యయం ఎక్కువగా ఉండడం కారణాలట. డ్రెస్ ల కోసం ఖర్చు చేసే విషయంలోనూ సింగపూరే టాప్ లో ఉంది. సింగపూర్ తర్వాత అధిక వ్యయం విషయంలో పారిస్, ఓస్లో, జ్యూరిచ్, సిడ్నీ నగరాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News