: తేజ్ పాల్ బెయిలుపై నేడు బాంబే హైకోర్టులో విచారణ
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది. తేజ్ పాల్ ను నేడు హైకోర్టులో హాజరు పరచనున్నారు. ఆయనపై లైంగిక వేధింపులు, దురుద్దేశంలో కూడిన వ్యాఖ్యలు చేయడం, అత్యాచార అభియోగాల కింద కేసు నమోదు చేశారు.