: కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్నీ అమలవుతాయి: వెంకయ్యనాయుడు


మున్సిపల్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ పన్నాగంలో భాగమేమోనని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు సందేహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు సీమాంధ్రలో బీజేపీ కారణంగా తెలంగాణ ఇచ్చామని చెబుతున్నారు, తెలంగాణలో అదే కాంగ్రెస్ నేతలు అమ్మ తెలంగాణ ఇచ్చిందని ఊరేగింపులు, సన్మానాలు, విజయయాత్రలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

రెండు రాష్ట్రాలను ప్రజలంతా అన్నదమ్ముల్లా అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. అన్నీ అమలు కావాలంటే దేశంలో అధికారంలోకి బీజీపీ రావాలి, అలాగే సీమాంధ్రలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని వెంకయ్యనాయుడు తెలిపారు. అలా వస్తేనే అన్ని హామీలు సమర్థవంతంగా అమలవుతాయని లేని పక్షంలో కష్టమేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News