: సెల్యులాయిడ్ పై బీహార్ కు ప్రత్యేక ప్రతిపత్తి అంశం?


బీహార్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలంటూ ఎప్పటినుంచో డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. దానిపై రెండు రోజుల కిందట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ధర్నా కూడా చేపట్టారు. ఇప్పుడీ అంశాన్ని సెల్యులాయిడ్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు బాలీవుడ్ దర్శకుడు ప్రకాశ్ ఝా. నిన్న బీహార్ బంద్ సందర్భంగా గాంధీ మైదాన్ లో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఝా మాట్లాడుతూ, ఈ అంశంపై ఓ డాక్యుమెంటరీ చిత్రం రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తన ప్రసంగంలో సంకేతాలిచ్చాడు. ఎల్జేపీ టిక్కెట్ పై చివరి లోక్ సభ ఎన్నికల్లో బీహార్ నుంచి పోటీ చేసిన ఝా పరాజయం పాలయ్యారు.

  • Loading...

More Telugu News