: నిద్రలో ఉండగా ముద్దు పెట్టేసుకున్నాడు... విమానంలో లైంగిక దాడి!


తాను నిద్రలో ఉండగా ముద్దు పెట్టేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో... విమానం దిగగానే ఎన్నారైని ఎఫ్ బీఐ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..హ్యూస్టన్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో అమెరికాలోని బేటన్ రోగ్ ప్రాంతంలో నివసించే దేవేందర్ సింగ్(61) సీట్లో కూర్చున్నాడు. అతని ప్రక్కన ఓ మహిళ విండో సీట్ లో కూర్చుంది. ఆమెకు సింగ్ ఎవరో తెలియదు.

విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికి ఆమె హాయిగా నిద్రపోయింది. నిద్రలో ఉండగా సింగ్ ముద్దు పెట్టుకున్నాడని, అంతటితో ఆగకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడని విమాన సిబ్బందికి తెలిపింది. విమానం ల్యాండ్ అయ్యేసరికి పోలీసులు ఉండాలని కూడా సూచించింది. దీంతో విమానం ల్యాండ్ అవ్వగానే సింగ్ ను ఎఫ్ బీఐ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు రుజువైతే దేవేందర్ సింగ్ కు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, కోటి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం విధించే అవకాశముంది.

  • Loading...

More Telugu News