: ఉద్యమాల వల్లే తెలంగాణ ఏర్పడలేదు: శ్రీధర్ బాబు


చట్టసభల్లో విభజన బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఉద్యమాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, తమ ఎంపీలు, నాయకులు ఒప్పించబట్టే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. ఈ క్రమంలో అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే విషయంలో ఏనాడు రాజీపడలేదని చెప్పిన శ్రీధర్ బాబు తెలంగాణ ఉన్నంత వరకు కాంగ్రెస్ ను ప్రజలెవరూ మరిచిపోరని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రపై ప్రచారం కల్పిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ తో విలీనం, పొత్తు ఉంటుందని తామెన్నడూ భావించలేదన్నారు.

  • Loading...

More Telugu News