: ఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ మధ్య హోరాహోరీ


లోక్ సభ ఎన్నికల సమరంలో ఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీల మధ్య నువ్వా? నేనా? అన్న పరిస్థితి ఉండబోతోంది. ఇక్కడ 7 లోక్ సభ స్థానాలుండగా.. బీజేపీ 4 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లను గెలుచుకుంటాయని సీఎన్ఎన్ ఐబీఎన్, లోక్ నీతి, సీఎస్ డీఎస్ నిర్వహించిన ఎలక్షన్ ట్రాకర్ వెల్లడించింది. కాంగ్రెస్ 0 నుంచి గరిష్ఠంగా 2 స్థానాలకు పరిమితం అవుతుందని పేర్కొంది. అయితే, జనవరిలో నిర్వహించిన సర్వేకు.. తాజాగా నిర్వహించిన సర్వేకు మధ్య ముఖ్య తేడా ఏమిటంటే.. ఆమ్ ఆద్మీ ఓటు శాతం తగ్గిపోవడం. జనవరిలో నిర్వహించిన సర్వేలో 48 శాతం ఓట్లు ఆమ్ ఆద్మీకి వస్తాయని వెల్లడవగా.. తాజాగా ఇది 35 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్, బీజేపీ చెరో 6 శాతం ఓట్లు పెంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 36 శాతం ఓట్లతో బీజేపీ ముందుండనుందని ఈ ట్రాకర్ పేర్కొంది.

  • Loading...

More Telugu News