: జైరాం రమేష్ మాటల్లో సీమాంధ్రకు ఒనగూరే ప్రయోజనాలు


కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఈ రోజు గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో సీమాంధ్రకు ఏంమేం చేయబోతున్నారో ఆయన మీడియాకు వివరించారు. ఆయన చెప్పిన వాటిలో ప్రధానాంశాలు ఇవే.

* ఉమ్మడి ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలనేది వారే నిర్ణయించుకోవచ్చు.
* 84 వేల మంది ఉద్యోగులను వారి చాయిస్ ను బట్టే బదిలీ చేస్తారు.
* స్థానికంగా, జిల్లాల్లో ఉండే ఉద్యోగులు అక్కడే ఉంటారు.
* రానున్న ఐదేళ్ల వరకు విద్యాసంస్థల ప్రవేశాల్లో మార్పు ఉండదు.
* సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం, వ్యవసాయ యూనివర్శిటీ, కేంద్రీయ విద్యాలయాలు.
* ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు.
* కృష్ణా జలమండలి సీమాంధ్రలో, గోదావరి జలమండలి హైదరాబాదులో ఉంటాయి.
* విశాఖపట్నానికి మెట్రో రైలు.
* విశాఖ నుంచి చెన్నై పారిశ్రామిక కారిడార్.
* రాజధాని, హైకోర్టు, ఇతర కార్యాలయాలు వేరు వేరు ప్రాంతాల్లో ఉండే అవకాశం.
* సీమాంధ్రలో రైల్వే జోన్ ఏర్పాటు
సీమాంధ్ర ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నాను కాబట్టి... హామీలన్నింటినీ నెరవేర్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని జైరాం రమేష్ చెప్పారు.

  • Loading...

More Telugu News