: ఉక్రెయిన్ సంక్షోభంతో బంగారం ధరలకు రెక్కలు
ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభంతో బులియన్ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. రష్యా తన దళాలను ఉక్రెయిన్ కు పంపనుందని.. అదే జరిగితే అమెరికా సహా అంతర్జాతీయ సమాజం రష్యాపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫలితంగా రష్యాలో చమురు ఉత్పత్తిపై ప్రభావం పడుతుందనే భయాల నడుమ నిన్న క్రూడాయిల్ ధర రెండున్నర శాతం పెరిగి బ్యారెల్ 105 డాలర్లకు చేరింది. సంక్షోభ సమయాల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించిన ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపడంతో పసిడి అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో ఔన్స్(31గ్రాములు)కు 28 డాలర్లు పెరిగి 1,350 డాలర్లకు చేరింది. గతేడాది అక్టోబర్ తర్వాత బంగారం ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. వెండి ధరలు కూడా పెరిగాయి.