: అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ నుంచి భారత్ కు ఉద్వాసన


అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) నుంచి భారత బాక్సింగ్ ఫెడరేషన్ (ఐబీఎఫ్)ను తాత్కాలికంగా బహిష్కరించారు. ప్రస్తుత క్రీడా వ్యవస్థ పేరు, కీర్తి, ఆటలపై ఉన్న ఆసక్తిని ఆఫీస్ బేరర్లు పాడు చేస్తున్నారని ఏఐబీఏ వ్యాఖ్యానించింది. 2012, డిసెంబర్ లో భారత ఫెడరేషన్ ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, గతనెలలో భారత ఒలింపిక్ అసోసియేషన్ పై అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ సస్పెన్షన్ ను ఎత్తివేయడంతో మళ్లీ తమ నిర్ణయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అయితే, పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో నిన్న(సోమవారం) ఓ ప్రకటనను విడుదల చేసిన ఏఐబీఏ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇంతటితో ఐబీఎఫ్ తో సంబంధానికి కొంతకాలం పాటు ముగింపు పలకాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. 2012లోనే బాక్సింగ్ అసోసియేషన్ నుంచి భారత్ ను మినహాయించడంతో పదహారు నెలల నుంచి ఫెడరేషన్ అధికారులకు ఎలాంటి మద్దతు లేదు.

  • Loading...

More Telugu News