: మయన్మార్ అధ్యక్షుడితో మన్మోహన్ భేటీ.. రాజపక్సేతోనూ సమావేశం!


మయన్మార్ లో జరుగుతున్న బిమ్ స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ దేశాధ్యక్షుడు యుతిన్ సేన్ తో భేటీ అయి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అలాగే, శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేతోనూ సమావేశమవనున్నారు. శ్రీలంకలో జరిగిన యుద్ధనేరాలపై అంతర్జాతీయ దర్యాప్తు నిర్వహించాలన్న అంశం ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ లో ఈ నెలాఖరున మరోసారి ఓటింగ్ కు రానుంది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు శ్రీలంక తమిళుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఇరుదేశాల అధినేతల మధ్య తమిళుల అంశం చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News