: ఆదిలాబాద్ అబ్బాయి... నేపాల్ అమ్మాయి ఒకటయ్యారు!


ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కుర్రాడు.. నేపాల్ కు చెందిన కుర్రది. ఇద్దరికీ హైదరాబాద్ లో పరిచయం. మనసులు ముడిపడ్డాయి. పెద్దల ఆమోదంతో చివరికి మనువాడారు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచాంద సర్పంచ్ బిట్లింగ్ నారాయణ కుమారుడు శ్రీకాంత్ రాజ్ హైదరాబాద్ లో డెల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నాలుగేళ్ల క్రితం నేపాల్ కు చెందిన జ్యోతిసోనార్ అతనికి పరిచయమైంది. అది ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు ఆమోదముద్ర వేయడంతో లక్ష్మణచాందలో సోమవారం వీరి వివాహం బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. జ్యోతి సోనార్ అమెజాన్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది.

  • Loading...

More Telugu News