: దమ్ముంటే నాపై పోటీ చేయ్... అసదుద్దీన్ కు కిషన్ రెడ్డి సవాల్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి దమ్ముంటే అంబర్ పేట నియోజకవర్గంలో తనపై పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మోడీ హైదరాబాదులో పోటీ చేసి గెలవాలని అసదుద్దీన్ సవాలు చేయడాన్ని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒవైసీని ఓడించడానికి బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త చాలంటూ చురకంటించారు. మజ్లిస్ అసలు పార్టీయే కాదని... అరాచక మతతత్వ పార్టీ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.