: నేడు ఢిల్లీకి గవర్నర్ నరసింహన్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన తరువాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే ప్రధమం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, హోంమంత్రి షిండే, రక్షణశాఖ మంత్రి ఆంటోని తదితర ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా వివరించనున్నారు. శుక్రవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పాలన దృష్ట్యా పరిపాలన కోసం గవర్నర్ కార్యాలయంలో ఇద్దరు సలహాదారుల నియామకం గురించి హోంమంత్రితో చర్చించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా అనుభవజ్ఞులు, వివాదరహితులైన వారినే సలహాదారులుగా నియమించాలని ఆయన కోరనున్నట్టు తెలుస్తోంది.